జగన్ పార్టీలోకి మాగుంట?

జగన్ పార్టీలోకి మాగుంట?

విధాన పరిషత్తు సభ్యుడు   మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది,. శనివారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాగుంటను బుజ్జగించేందుకు చంద్రబాబే రమ్మన్నారా? లేక పార్టీ మారే అంశాన్ని పార్టీ అధినేతకు వివరించడానికి ఆయనే స్వయంగా వచ్చారా? అన్నది తేలాల్సి ఉందని పార్టీ వర్గాలుచెప్పాయి.. చీరాల ఎమ్మెల్య ఆమంచి కూడా చంద్రబాబు కలిసిన తర్వాతే వైసీపీలో చేరారు. ఇప్పుడు మాగుంట కూడా అదే తరహాలో ఫిరాయిస్తారానేది కుతూహలంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తె.దే.పా తరపున ఒంగోలు నుంచి పోటీ చేసిన శ్రీనివాసులురెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అనంతరం ఆయనకు నాయకత్వం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఇటీవల పార్టీ  వైఖరిపై ఆయన ఆగ్రహంతో  ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేయటం గురించి గురువారం తన అనుచరులతో చర్చించినట్లు సమాచారం.. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos