వారిని గాడిదలపై ఊరేగించాలి…

  • In Film
  • February 16, 2019
  • 168 Views
వారిని గాడిదలపై ఊరేగించాలి…

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌
జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై బాలీవుట్‌ నటి కంగనా రనౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేసారు.భద్రత నియమాలు అతిక్రమించి మన సైనికులను దారుణంగా హతమార్చిన పాకిస్థాన్‌కు
గట్టిగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.జవాన్లను హత్య చేసి దేశ గౌరవాన్ని దెబ్బ
తీసిన పాకిస్థాన్‌ పట్ల ఇంకా మెతక వైఖరి అవలంబిస్తే పిరికిపందల కింద జమ కడతారని
ఆగ్రహం వ్యక్తం చేసారు.44 మంది జవాన్లను హత్య చేసిన తరువాత కూడా పాకిస్థాన్‌తో
చర్చలు,శాంతి అంటూ వ్యాఖ్యలు చేసే వ్యక్తుల ముఖాలకు నలుపు రంగు పూసి గాడిదలపై
ఊరేగించి నడిరోడ్డుపై కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.దీంతోపాటు ప్రముఖనటి షబానా
అజ్మీపై కూడా కంగనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘‘షబానా లాంటి వ్యక్తులు సాంస్కృతిక మార్పిడిని ఆపేయాలంటూ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌ను ముక్కలు చేయాలని నినదిస్తున్న మూకలకు మద్దతు తెలిపేది ఇలాంటి వారే. ఉరీ ఘటన తరవాత పాకిస్థాన్‌ నటులపై నిషేధం విధించిన చోట కార్యక్రమం ఎందుకు చేయాలి. ఇలా శత్రు మూకలకు దన్నుగా నిలిచే వారు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.’’ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది. అమరులకు సంఘీభావంగా కంగన మణికర్ణిక సక్సెస్‌ మీట్‌ను సైతం రద్దు చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos