ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరనున్నట్లు
వార్తలు వినిపిస్తున్నాయి.ప్రజాసంకల్ప యాత్ర సమయంలోనే సాంబశివరావు వైసీపీ అధినేత జగన్‌ను
కలిసారు.డీజీపీగా విమరణ పొందిన అనంతరం సాంబశివరారవుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
గంగవరం పోర్టులో కీలక బాధ్యతలు అప్పగించింది.ఆ హోదాలో ఉండగానే సాంబశివరావు వైఎస్ జగన్‌ను
కలుసుకున్నారు.ఇది జరిగిన వెంటనే సాంబశివరావును తనవద్దకు పిలిపించుకున్న సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్‌ను కలవడంపై వివరణ కోరారు.అయితే జగన్ గంగవరం పోర్టు పరిధిలోకి రావడంతో
మర్యాదపూర్వకంగా ప్రతిపక్షనేతలు కలిసామని వివరణ ఇచ్చారు.అయితే ఎన్నికలు సమీపిస్తున్న
తరుణంలో మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలు మరోసారి హాట్‌టాపిక్‌గా
మారాయి.ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు,ఒక ఎంపీతో పాటు తెదేపాకు అత్యంత సన్నిహితుడు జైరమేశ్
కూడా వైసీపీలో చేరడంతో ఉక్కిరిబిక్కిర అవుతున్న చంద్రబాబుకు మాజీ డీజీపీ సాంబశివరావు
వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు మరింత చికాకు పెడుతున్నట్లు సమాచారం.మరోవైపు
ఆళ్లగడ్డ తెదేపా నేత ఇరిగినేని రాంపుల్లారెడ్డి సోదరులు కూడా వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు.వైసీపీ
నుంచి తెదేపాలోకి వచ్చి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా రాంపుల్లారెడ్డి
సోదరులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అఖిల ప్రియతో పొసగకపోవడం,తాము చేసిన ఆరోపణలపై
తెదేపా అధినేత స్పందించకపోవడంతో గత ఏడాది డిశెంబర్లో డీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
చేశారు. రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీలో చేరుతుండడండ అఖిలప్రియకు వ్యతిరేకంగా
తెదేపా నేతలు ఓక్కటవుతుండడం ఆళ్లగడ్డలో తెదేపాకు భారీనష్టం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి..