మారుతున్న
జీవన శైలి వల్ల ఇంటిలో తిండి చేసుకోవడం కూడా కష్టంగా మారుతోంది. మార్కెట్‌లో
లభ్యమవుతున్న సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ గర్భిణులు
ఇలాంటి ఆహారాన్ని ఎంచుకునే చాలా జాగ్త్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా
డబ్బాలలో లభ్యమయ్యే తిండి మంచిది కాదని ఓ సర్వే హెచ్చరించింది. ఇలాంటి తిండి
గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, భవిష్యత్తులో వారి పునరుత్పత్తి
శక్తిని దెబ్బ తీస్తుందని బోస్టన్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇలాంటి ఆహార పదార్థాలు అండాశయం పనితీరును ప్రభావితం చేస్తాయని, ఒక్కోసారి అకాల అండాశయ వైఫల్యాలకు, పాలిస్టిక్ అండాశయ సిండ్రోమ్‌కు దారితీస్తుందని వెల్లడించారు.