హెచ్చరించి మరీ తెగబడ్డారా?

హెచ్చరించి మరీ తెగబడ్డారా?

శ్రీనగర్‌: పుల్వామా
 దాడి గురించి ఉగ్రవాదులు
పరోక్షంగా  బలగాలకు  హెచ్చరించినట్లు తెలుస్తోంది. నరమేధానికి రెండు రోజుల ముందు ట్విటర్‌లో ఆత్మాహుతి దాడికి సంబంధించిన 33 సెకన్ల నిడివి కలిగిన ఒక వీడియో విపరీతంగా సంచరించింది. దీన్నేజమ్ము-కశ్మీర్‌ పోలీసులు నిఘా వర్గాలకు చెప్పినట్లు తెలుస్తోంది. అందులో సోమాలియా భద్రతా సిబ్బందిపై జేఈఎం ఉగ్రవాదులు దాడి చేసారు. కశ్మీర్‌లోనూ ఇదే తరహా దాడి జరగనుందనిహెచ్చరించటమే దీని ఆంతర్యంగా భావిస్తున్నారు.ఆ ట్విటర్‌ ఖాతా నిర్వహణ కేంద్రాన్ని పసి గట్టేందుకు భద్రతా సంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఏడాది ముందే పకడ్భందీ వ్యూహం

రెండు ఉగ్రవాద సంస్థలు ఏడాది ముందే దాడికి వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాల వాహనంతో  జరిగిన
ఈ దాడి వాటి పరికల్పనగా భావిస్తున్నారు. 2001లో కశ్మీర్‌ అసెంబ్లీ వద్ద  కూడా
ఇదేమాదిరి దాడి జరపటం ఇక్కడ ప్రస్తావనార్హం. ‘కొన్ని రోజుల  కిందట ఈ తరహా దాడుల గురించి  చర్చించాం. ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతుంటాయి. ముష్కరులు కూడా  భవిష్యత్తులో ఇక్కడ కూడా ఈ ప్రయోగాన్ని అమలు చేస్తారని భావించాం. కానీ ది ఇంత త్వరగా అమలు
చేస్తారని అంచనా వేయలేక పోయాం.ఈ తరహా దాడులను ముందుగా గుర్తించడం, నివారించడం కాస్తా కష్టమైన పనే. సాధరణంగా దాడులకు తెగబడే వారు రద్దీ ఎక్కువగా ఉండే  సమయంలో విధ్వంసం సృష్టిస్తారు. అలాంటప్పుడు రోడ్డు మీద ఉన్న అన్ని వాహనాలను పూర్తిగా పరిశీలించడం కుదరదు. ఫలితంగా దాడులను నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు’ ఇంటిలిజెన్స్‌ అధికారి ఒకరు చెప్పారు.
 జవాన్ల కాన్వాయ్‌లను ట్రాఫిక్‌ లేని సమయంలో అంటే రాత్రి పూట లేదా తెల్లవారుజామున తరలించాలి. అప్పుడు తక్కువ ట్రాఫిక్‌ ఉంటుంది కాబట్టి అన్ని వాహనాలను జాగ్రత్తగా పరీక్షించవచ్చు. లేదా.. భద్రతాబలగాల కాన్వాయ్‌ల తరలింపు పూర్తయ్యవరకే ఆయా మార్గాల్లో వాహనాలు తిరగకుండా రోడ్డును బ్లాక్‌  చేస్తే ఇలాంటి ప్రమాదాల్ని
నివారించ వచ్చని ఒక ప్రశ్నకు బదులుగా వివరించారు.  వీటి గురించి మరింత లోతుగా చర్చించాలని భావిస్తోన్న దశలో ఈ దాడి
జరిగిందని ఆక్రోశించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos