కపిల్ రికార్డును అధిగమించిన మరో బౌలర్

కపిల్ రికార్డును అధిగమించిన మరో బౌలర్

దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ 437 వికెట్లను సాధించడం ద్వారా ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. డర్బన్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో స్టెయిన్‌ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. నాలుగు వికెట్లను తీసుకోవడం ద్వారా అతను కపిల్‌ దేవ్‌ (434 వికెట్లు) రికార్డును అధిగమించాడు. అతనికిది 92వ మ్యాచ్‌.   ఇప్పటికే ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్‌ బ్రాడ్‌ కూడా 437 వికెట్లను సాధించాడు. ముత్తయ్య మురళీ ధరన్‌(శ్రీలంక-800 వికెట్లు) తొలి , షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా-708) రెండో స్థానాల్లో ఉన్నారు. అనిల్‌ కుంబ్లే (619), జేమ్స్‌ అండర్సన్‌ (ఇంగ్లండ్‌-575), మెక్‌గ్రాత్‌(ఆస్ట్రేలియా-563), కర్ట్నీ వాల్ష్‌( వెస్టిండీస్‌-516)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos