కేంద్రానికి అన్ని విధాల అండ:రాహుల్

కేంద్రానికి అన్ని విధాల అండ:రాహుల్

దిల్లీ: “భద్రతాబలగాల
మీద జరిగిన ఉగ్రదాడి ఘోరమైంది. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, దేశం కేంద్ర
ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతుగా ఉంటాయి..జవాన్లకు అండగా నిలుస్తామని కాంగ్రెస్
పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం
ఇక్కడ  మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన
సింగ్‌తో కలసి మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.  ‘ఇది చాలా దారుణమైన దాడి. ఈ ఘటన చాలా
విచారకరం. జవాన్లకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఏ శక్తి మన
దేశాన్ని విభజించలేదు. ప్రభుత్వానికి మా సహకారాన్ని
అందిస్తాం. రెండు రోజుల వరకు ఏ ఇతర అంశాలను చర్చించం’ అని  ప్రకటించారు. ..
‘‘దేశాన్ని విభజించాలని టెర్రరిస్టులు భావిస్తున్నారు. అందుకే
వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు.. ఉగ్రవాదులు
ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్‌ ప్రజలను వేరుచేయలేరు.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలి, అపుడే మన ఐక్యత గురించి
వారి తెలుస్తుంది. యావత్ దేశం, ప్రతిపక్షాలు కేంద్రానికి, భద్రతా దళాలకు మద్దతుగా
ఉంటాయి. ఏ ప్రేమతో ఈ దేశం నిర్మితమైందో… ఆ ప్రేమకు విద్వేషంతో హాని
తలపెట్టలేరు’’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ‘ ఇది నివాళులు అర్పించాల్సిన
సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల
త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో
పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే
చర్చకు తావు లేదు’ అని కుండబద్ధలు కొట్టారు.

పోరులో
రాజీ వద్దు
.

 ‘ఇది చాలా బాధాకరమైన రోజు. మన దేశం 40 మంది జవాన్లను కోల్పోయింది. జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడమే మన మొదటి కర్తవ్యం. ఉగ్రవాదం అనేది రుగ్మత. దానిపై  సాగించే పోరాటం లో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు’ అని  మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్ దాడిని తీవ్రంగా ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos