ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం బలహీనంగా , నష్టాలతో ప్రారంభమయ్యాయి. 117 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 35916 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 10758 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 36వేల స్థాయిని, నిఫ్టీ 10800 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.ఎస్ బ్యాంకు టాప్ విన్నర్‌గా ఉంది. బుధవారం ఆర్‌బీఐ ఆస్తుల ప్రకటన విషయంపై ఆర్‌బీఐ విచారణలో యస్ బ్యాంక్‌కు క్లీన్‌చిట్ లభించడంతో దాని షేరు ధరలు పెరిగాయి.ఇండియా బుల్స్, సన్ పార్మా, ఐటీసీ లాభపడుతున్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, జెట్ ఎయిర్‌వేస్, అదానీ పవర్ నష్టపోతున్నాయి. ఒక దశలో షేరు ధర దాదాపు 25 శాతం పెరిగింది. ఇవాళ దాదాపు 750 కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఎవరెడీ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్‌డీఐఎల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, జెట్ ఎయిర్‌వేస్, ఎంఎంటీసీ వంటి సంస్థలు న్నాయి.చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్ ధర 1.5శాతం పెరిగింది. చైనా వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉండటంతో ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.
విధంగా షేరు ధ
రలు పెరిగాయి
ఇండియా బుల్స్, సన్ పార్మా, ఐటీసీ లాభపడుతున్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, జెట్ ఎయిర్‌వేస్, అదానీ పవర్ నష్టపోతున్నాయి. ఒక దశలో షేరు ధర దాదాపు 25 శాతం పెరిగింది. ఇవాళ దాదాపు 750 కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఎవరెడీ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్‌డీఐఎల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, జెట్ ఎయిర్‌వేస్, ఎంఎంటీసీ వంటి సంస్థలు ఉన్నాయి.చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్ ధర 1.5శాతం పెరిగింది. చైనా వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉండటంతో ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.