ఆకట్టుకుంటున్న బేబీ సిట్టర్‌ యాడ్

ఆకట్టుకుంటున్న బేబీ సిట్టర్‌ యాడ్

భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌, ఆస్ట్రేలియా టెస్టు జట్టు
కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ల మధ్య సాగిన స్లెడ్జింగ్‌ ఇప్పుడు యాడ్‌ రూపంలో
నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఓ మ్యాచ్‌లో
పెయిన్‌ పంత్‌ను, మా పిల్లలను ఆడిస్తావా అని ఎగతాళి చేయడం, పంత్‌ దీనిని  సరదాగా నిజం చేయడం తెలిసిందే. తదనంతరం పెయిన్‌
భార్య కూడా పంత్‌ బెస్ట్‌ బేబీ సిట్టర్‌ అని కితాబునిచ్చింది. ఈ నేపథ్యంలో
ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనను పురస్కరించుకుని స్టార్‌ స్పోర్ట్స్‌ మాజీ ఓపెనర్‌
వీరేంద్ర సెహ్వాగ్‌తో ఓ యాడ్‌ను రూపొందించింది. అదిప్పుడు అందరినీ విశేషంగా
ఆకర్షిస్తోంది. దీనిపై రిషభ్‌ స్పందిస్తూ, వీరూ పాజీ గొప్ప క్రికెటర్‌గా, బేబీ
సిట్టర్‌గా ఎలా ఉండాలో చూపించారు. ఇదో స్ఫూర్తిదాయకమైన వీడియో అంటూ ట్వీట్‌
చేశాడు. దీనిపై
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌
మాథ్యూ హేడెన్‌ ఘాటుగా స్పందించాడు.  ప్రధానంగా ఆసీస్‌ జట్టు జెర్సీలతో యాడ్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు.  అయితే తాను సరదాగా ఈ కామెంటు
చేస్తున్నానని చెప్పడం కొసమెరుపు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos