ఇంగ్లండ్ కెప్టెన్
జో రూట్ బ్యాటింగ్ చేస్తుండగా, అతనిని గే (స్వలింగ సంపర్కుడు)గా సంబోధించినట్లు ఆరోపణలు
ఎదుర్కొంటున్న విండీస్ ఫాస్ట్ బౌలర్ షెనాన్ గాబ్రియల్‌పై ఐసీసీ విచారణకు ఆదేశించింది.
మ్యాచ్ అంపెర్ల ఫిర్యాదు మేరకు అభియోగాలు నమోదయ్యాయని, దీనిపై మ్యాచ్ రిఫరీ జెఫ్
క్రో విచారణ జరుపుతారని ఐసీసీ అధికారిక ట్విటర్‌లో తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు
ఈ సంఘటనపై తదుపరి కామెంట్లు ఉండబోవని కూడా పేర్కొంది.