మన దేశంలో క్రికెట్‌పై
ఉన్న క్రేజ్‌ను ఈ ఫొటో చెప్పకనే చెబుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు టీవీల్లో క్రికెట్
మ్యాచులను వీక్షించడమే కాదు… వీలు దొరికినప్పుడల్లా ఆడడానికీ ప్రయత్నిస్తుంటారు. ఇంతకూ
ఈ ఫొటో సంగతేమంటే…వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విద్యాలయాల 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని
పురస్కరించుకుని క్రికెట్ టోర్నీని నిర్వహించారు. టోర్నీలో పాల్గొంటున్న విద్యార్థులు
ధోతి, కుర్తాను ధరించడంతో పాటు మూడు నామాలు పెట్టుకుని ఫీల్డ్‌లోకి దిగుతున్నారు. అంపైర్లది
కూడా అదే వస్త్రధారణ. మరో విశేషమేమంటే…ఈ టోర్నీ కామెంటరీని సంస్కృతంలో చెబుతున్నారు.
దీంతో మ్యాచులను చూడడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. పది ఓవర్ల ఫార్మాట్లో టోర్నీని
నిర్వహిస్తున్నారు.