న్యూఢిల్లీ : రాజ్యసభను బుధవారం నిరవధికంగా వాయిదా పడింది . దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతనుఎదుర్కొన్న పౌరసత్వ సవరణ ,ముమ్మారు తలాఖ్ ముసాయిదాలకు కాలం చెల్లాయి . రాజ్యసభ నియమావళి ప్రకారం లోక్‌సభ ఆమోదం పొందని బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటే, లోక్‌సభ రద్దుతో కాలదోషం పట్టదు. లోక్‌సభ ఆమోదం పొందిన ముసాయిదా రాజ్యసభ ఆమోదాన్ని పొందని దశలో లోక్‌సభ రద్దుఅయితే దానికి కాలదోషం పడుతుంది. పౌరసత్వ సవరణ , 2019; ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ ముసాయిదాలు , 2018 లోక్‌సభ ఆమోదం పొందాయి. ఇవి రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే నూతన లోక్‌సభ ఈ ముసాయిదాలి్ల్ని మరోసారి ఆమోదించవలసి ఉంటుంది.