గే అయితే ఏంటట..?

గే అయితే ఏంటట..?

సెయింట్‌ లూసియా : క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం సర్వ సాధారణమే. ఒక్కో సారి విపరీతానికి దారి తీస్తే, చాలా వరకు క్రీడా స్ఫూర్తితో సమసిపోతుంటాయి. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య మూడో టెస్టు మూడో రోజు ఆటలో కెప్టెన్‌ జో రూట్‌, వెస్టిండీస్‌ బౌలర్‌ గాబ్రియల్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. రూట్‌పై గాబ్రియల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే  అతను చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టంగా వినిపించకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దీనిపై  మ్యాచ్‌ తర్వాత రూట్‌ మాట్లాడుతూ.. గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే, అతనే క్షమాపణలు కోరాలి. పలు సందర్బాల్లో ఆన్‌ఫీల్డ్‌ మాటల యుద్ధం అనేది సహజం. కానీ వారు ఏదైతే వ్యాఖ్యానించారో దానికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో క్షమించమని కోరే తత్వం కూడా ఉండాలి’ అని తెలిపాడు. ఈ ఘటనపై క్రికెట్‌ అధికారులకు రూట్‌ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.                                     

తాజా సమాచారం

Latest Posts

Featured Videos