ముంబయి :వరుసగా మూడో సెషన్‌లోదేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజి సూచీ సెన్‌సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 36153 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సూచీయైన నిఫ్టీ కూడా 57 పాయింట్లు నష్టపోయి 10831 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికన్ డాలరుతో రూపాయి విలువ 71.17గా ఉంది. నేటి మార్కెట్‌ను ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లు కుంగదీశాయి.యూనియన్ బ్యాంక్ షేర్లు 1.75శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసు సుచీ 1.09శాతం కుంగాయి. మరోపక్క ఎడల్‌వైజ్ ఫైనాన్షియల్ సర్వీసు, హెచ్‌డీఎప్‌సీ షేర్లు కూడా నష్టపోయాయి. గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ షేర్లు 12శాతం పడిపోయాయి. ఈ కంపెనీ లాభంలో 27 శాతం కుంగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క హిందాల్కో లాభం కూడా మూడోత్రైమాసికంలో 37శాతం తగ్గింది. అంతర్జాతీయంగా నెల కొన్న అనిశ్చితి పరిస్థితులకు తోడు త్వరలో భారత్‌లో జరగ నున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారని బ్రోకర్లు పేర్కొన్నారు. అదే విధంగా మంగళ వారం (ఫిబ్రవరి 12న) వెల్లడి కానున్న ద్రవ్యోల్బణం, పారిశ్రామి కోత్పత్తి గణాంకాలు ప్రతికూలంగా ఉండొచ్చన్న అంచనాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ప్రపంచ వృద్ధి రేటు భయా లు, ఆసియన్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ కావ డం, డిసెంబ ర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొన్ని కార్పొరేట్ కంపెనీల ఫలితాలు నిరాశజనకంగా నమోదవడం తదితర పరి ణామాల మధ్య మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
డాక్టర్ రెడ్డీస్‌కు యుఎస్‌ఎఫ్‌డిఎ షాక్..
ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌కు మరోసారి అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యుఎస్‌ఎఫ్‌డిఎ) షాక్ ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి యూనిట్-3లో తనిఖీలు నిర్వహించిన సంస్థ యూనిట్‌లో 11 లోపాల (అబ్జర్వేషన్లను)ను గుర్తించింది. ఈ మేరకు 483-ఫామ్‌ను జారీ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ శుక్రవారం స్టాక్ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. కాగా నియమిత కాలంలోగా ఎఫ్‌డిఎ గుర్తించిన లోపాలను సవరించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో మదుపర్లు సోమవారం ఆ కంపెనీ వాటాల విక్రయానికి మొగ్గు చూపారు. దీంతో ఎన్‌ఎస్‌ఇలో ఓ దశలో డాక్టర్ రెడ్డీస్ షేర్ 7.59 శాతం పతనమై 2,559 కనిష్ట స్థాయిని తాకింది. బిఎస్‌ఇలో ఓ దశలో రూ.2,704 గరిష్ట స్థాయిని తాకిన సూచీ.. అమ్మకాల ఒత్తిడితో మరో దశలో 7.81 శాతం తగ్గి రూ.2,555.5 వద్ద నమోదయ్యింది. తుదకు 5.60 శాతం తగ్గి రూ.2,6161.95 వద్ద ముగిసింది.