ఫిబ్రవరి 14న నోటిఫికేషన్…

ఊహించిదాని కంటే కాస్త ముందుగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి,కృష్ణ,గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల14వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.దీంతో ఫిబ్రవరి14వ తేదీ నుంచి రాష్ట్రంలోని సగం జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.ఎమ్మెల్సీల కోడ్‌ ముగియగానే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.మార్చ్‌౧వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో కొన్ని పనులకు శంకుస్థాపనం చేయనుండడంతో మార్చ్‌1 వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావచ్చని తెలుస్తోంది.దీంతో ఎటు చూసినా ఫిబ్రవరి14వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమాలు, పథకాలు,శంకుస్థాపనలు చేపట్టడానికి వీలు పడదు.ఈ నేపథ్యంలో  ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడానికైనా,కొత్త కార్యక్రమాలు,పథకాలు,శంకుస్థాపనలు చేయడానికైనా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది.చాలా తక్కువ రోజులు సమయం ఉండడంతో ఏపీ కేబినెట్ 13న సాయంత్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారులకు బదిలీలు చేపట్టనుంది. ఇప్పటికే 103 మంది డిప్యూటీ కలెక్టర్లు – ఆర్డీవోల బదిలీలు చేసేసింది. కొత్త సంక్షేమ పథకాలకు బ్రేక్ పడనున్న నేపథ్యంలో పాతవి కొనసాగించే వీలుంటుంది కాబట్టి కోడ్ కు ముందే పలు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చి ఎన్నికలకు వెళ్లాలని బాబు ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos