ముంబై : అంతర్జాతీయంగా ఏర్పడిన
అనిశ్చితి కారణంగా మదుపర్లు అమ్మకాలకు తెగబడడంతో దేశీయ మార్కెట్లు నష్టాలను
మూటగట్టుకున్నాయి. మొత్తం మీద సెన్సెక్స్
151 పాయింట్లు పతనమై 36,395 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,899 వద్ద
స్థిరపడ్డాయి. డాలర్ రూపాయి మారకం విలువ రూ.71.19గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో టాటా
మోటార్స్, టాటా స్టీల్, ఐఓసీ, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాటాలు స్వల్పంగా
లాభపడ్డాయి. రెడ్డీస్ ల్యాబ్స్, మహింద్రా అండ్ మహింద్రా, ఓఎన్జీసీ, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.