ముంబై : భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్లలో ఎవరు అత్యుత్తములో తేల్చేది కష్టమని సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ముంబైలో అతను మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ అద్భుతంగా ఆడుతారని, ఒంటి చేత్తో మ్యాచులను గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయని వివరించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్లో టెక్నిక్ ప్రధాన పాత్ర పోషిస్తే, విరాట్ కోహ్లీ నిరంతర శ్రమ జీవి అని పేర్కొన్నాడు. వారిద్దరిలో ఎవరు బెస్టో తేల్చడం కన్నా, ఇద్దరూ భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు.