ఆక్లాండ్: మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్
ధోనీ వికెట్ల వెనుకే కాదు బ్యాటింగ్ సమయంలోనూ చాలా అప్రమత్తంగా ఉంటాడు. ఆక్లాండ్‌లో
శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇది మరో సారి రుజువైంది. 16వ ఓవర్‌లో
కివీస్ స్పినర్ సోధీ ధోనీని ఔట్ చేయాలనే ఎత్తుగడతో ఆఫ్ స్టంప్‌కు ఆవలగా, ధోనీ బ్యాట్‌కు
దొరకని విధంగా బంతిని విసిరాడు. అయితే ఫ్రంట్ ఫుట్‌గా ముందుకొచ్చిన ధోనీ ఆ బంతిని
భారీ షాట్‌గా కొట్టాలనుకుని, వెంటనే తేరుకుని బంతి వికెట్ కీపర్ చేతికి వెళ్లకుండా
అడ్డుకోవడమే కాకుండా, ఒక పరుగు చేశాడు. దీంతో ధోని సమయస్ఫూర్తి మరో సారి బయటపడింది.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.