టీడీపీ ఎమ్మెల్యే అనితపై చెక్‌బౌన్స్‌ కేసు

  • In Crime
  • February 9, 2019
  • 180 Views
టీడీపీ ఎమ్మెల్యే అనితపై చెక్‌బౌన్స్‌ కేసు

చెల్లని చెక్కు
ఇచ్చి అధికారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనను మోసం చేసారంటూ విశాఖ
జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండంలం రాజుపేట వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ
క్రాంట్రాక్టర్‌ ఆరోపించారు.వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ..తాను జిల్లాలో
మోస్తరు సివిల్‌ కాంట్రాక్టు పనులు చేస్తుంటానన్నారు.పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత
2015 అక్టోబర్‌లో తన వద్ద రూ.70లక్షల అప్పుగా తీసుకున్నారని అందుకు సంబంధించి ప్రామిసరీ
నోటు,పోస్ట్‌డేటెడ్‌ చెక్కు తమకు ఇచ్చారన్నారు.అయితే చెప్పిన గడువు ముగిసినా అప్పు
చెల్లించలేదని దీనిపై ప్రశ్నిస్తే ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకులో రుణం తీసుకోవడానికి
దరఖాస్తు చేసుకున్నామని రుణం డబ్బులు వచ్చిన వెంటనే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తామని తెలిపారన్నారు.కాగా
ఆర్థిక సమస్యలు తీవ్రతరం కావడంతో అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో గత ఏడాది జులై
నెలలో రూ.70లక్షల చెక్కు(నంబర్‌994220)ఇచ్చారన్నారు.మరుసటి రోజు ఎమ్మెల్యే అనిత ఇచ్చిన
చెక్కు బ్యాంకులో వేయగా అనిత బ్యాంకు ఖాతాలో డబ్బులు లేదంటూ బ్యాంకు అధికారులు తెలిపారన్నారు.ఇక
చేసేదేమి లేక శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించడంతో సివిల్‌ కేసుకు సంబంధించి ఈనె
12వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి అనితకు సమన్లు జారీ
చేసారు. అధికారం తన చేతిలో ఉందని, ప్రజల్ని ఇలా మోసం చేయడం సరికాదని బాధితుడు వాపోతున్నాడు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టడంతో అప్పులు భారీగా పేరుకుపోయాయని అప్పులు
చెల్లించకపోతే పరువు పోతుందంటూ ఎమ్మెల్యే అనిత ప్రాధేయపడడంతో ఏళ్ల తరబడి సమకూర్చుకున్న
రూ.70లక్షల డబ్బు మొత్తాన్ని ఒకేసారి అనితకు ఇచ్చామన్నారు.తీసుకున్న అప్పు చెల్లించకపోగా
చెల్లని చెక్కు ఇచ్చి తమను మోసం చేయడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటూ శ్రీనివాసరావు
తెలిపారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos