ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కల్తీ మద్యం 30 మందిని బలిగొంది. ఉత్తరప్రదేశ్ లోని సహరన్‌పూర్, ఖుషీనగర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించినట్లు ఖుషీనగర్ జిల్లా మేజిస్ర్టేట్ అనిల్ కుమార్ తెలిపారు. ” విచారణకు ఆదేశించామనీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 9 మంది ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేశామని” వెల్లడించారు., మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ఇవ్వాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ,రెండు రోజుల కిందట ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో స్ధానికులు కల్తీ మద్యం సేవించడంతో పలువురు తీవ్ర అస్వస్ధతకు గురవగా, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 14 మంది మరణించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 13 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసినట్టు హరిద్వార్ ఎస్పీ వెల్లడించారు.