ఆక్లాండ్: టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డుల వేట కొనసాగుతోంది. కివీస్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేల్లో అర్ధ సెంచరీ బాదిన రోహిత్ ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు, అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇదే మ్యాచ్‌లో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టిన రోహిత్ టీ20ల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్ చెరో 103 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ ఇప్పటి వరకు మొత్తంగా 347 సిక్సర్లు బాదాడు.