రీల్స్​, ఫొటోలు బ్యాన్

రీల్స్​, ఫొటోలు బ్యాన్

న్యూ ఢిల్లీ : సోషల్​ మీడియా రీల్స్​, వీడియోలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలో ఫొటోలు దిగడం, సోషల్ మీడియా రీల్స్​, వీడియోలు చేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఈ ప్రదేశాన్ని హై సెక్యూరిటీ జోన్​గా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు మీడియా ప్రతినిధులు సైతం ఇంటర్వ్యూలు, లైవ్​ కోసం వారికి కేటాయించిన లో సెక్యూరిటీ జోన్​ ప్రాంతాన్ని వినియోగించుకోవాలని సూచించింది. హై సెక్యూరిటీ జోన్​లో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం మొబైల్​ ఫోన్​ వినియోగించడం నిషేధం. కెమెరాతో పాటు ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్​ లాంటి వస్తువులు వాడకూడదు. ముఖ్యంగా రీల్స్, వీడియోలు తీయడం నిషిద్ధం. ఒకవేళ ఈ ఆదేశాలను న్యాయవాది, పిటిషనర్లు, క్లర్క్​లు, బార్​ అసొసియేషన్​ సభ్యులు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ఒకవేళ ఈ నిబంధనలను ఎవరైనా మీడియా ప్రతినిధి అతిక్రమిస్తే సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్​లోకి నెల పాటు ప్రవేశం ఉండదు.ఈ నిబంధనలను ముఖ్యంగా సుప్రీ కోర్టు సిబ్బంది, రిజిస్టీ అతిక్రమిస్తే తీవ్రమైన అంశంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇతర శాఖల సిబ్బంది అతిక్రమిస్తే ఆయా శాఖల నిబంధనల ప్రకారం హెచ్​ఓడీలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు, సిబ్బంది, న్యాయవాదులు హై సెక్యూరిటీ జోన్​లో ఫొటోలు తీసుకునే సమయంలో అడ్డుకునే హక్కు భద్రతా అధికారులకు ఉంటుందని చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos