కృష్ణా : మండల కేంద్రమైన మోపిదేవి పిఎసిఎస్ వద్ద యూరియా పంపిణీ చేయనున్నారని సమాచారం తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు పట్టాదారు పుస్తకాలతో యూరియా పంపిణీ చేయడంతో రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలతో యూరియను తీసుకెళుతున్నారు. గత పది రోజుల నుంచి యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో మరోసారి యూరియా కోట వేసేందుకు రైతులు సిద్ధం కాగా, యూరియా దొరక్కపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.