రష్యా సైన్యంలో చేరొద్దు

రష్యా సైన్యంలో చేరొద్దు

న్యూ ఢిల్లీ : ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం లో కొందరు భారతీయులు రష్యా సైన్యం  తరఫున పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకుంటోందంటూ పలువురు బాధితులు ఇప్పటికే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ మేరకు కీలక సూచన చేసింది. రష్యా సైన్యం ఆఫర్లు ప్రమాదకరమని హెచ్చరించింది. భారతీయులు రష్యా సైన్యంలో చేరొద్దంటూ సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రష్యా సైన్యంలో భారతీయ పౌరులను  నియమించుకున్నట్లు వస్తున్న నివేదికలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ప్రకటనలో తెలిపారు. రష్యా  సైన్యంతో పనిచేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించిందని చెప్పారు. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారిని వెనక్కి పంపించాలని కోరుతూ మాస్కో అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బాధిత కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Also Read..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos