భువనేశ్వర్ : ఒరిస్సాలో గోగూండాలు రెచ్చిపోయారు. ఆవును చంపాడన్న నెపంతో 35 ఏళ్ల దళితుడిని దారుణంగా కొట్టి చంపారు. దేవగఢ్ జిల్లా రియామల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుండేజురి గ్రామంలో బుధవారం ఘటన జరిగింది. మృతుడ్ని కిషోర్ చమర్‌గా గుర్తించారు. దేవ్‌గఢ్ ఎస్‌పి అనిల్‌కుమార్ మిశ్రా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కౌన్సిదీప గ్రామానికి చెందిన వీరిద్దరూ చర్మకారులు. కుండేజరి సమీపంలోని అటవీ ప్రాంతంలో అనారోగ్యం కారణంగా చనిపోయిన పశువుల కళేబరం నుంచి చర్మాన్ని సేకరిస్తుండగా..కొందరు గోగూండాలు దాడికి పాల్పడ్డారు.ఆ పశువును తాము చంపలేదని చర్మకారులు ఇరువురు ప్రాదేయపడినా గోగూండాలు చితకబాదడంతో కిషోర్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన గౌతమ్ నాయక్ గోగూండాల చెర నుంచి తప్పించుకొని గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆరుగురు గోగూండాలను అదుపులోకి తీసుకున్నారు.