విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్ ని మూడురోజులపాటు ఎసిబి కస్టడీకి తీసుకుంది. జిల్లా జైలు నుంచి సంజయ్ ను ఆంధ్రప్రదేశ్ ఎసిబి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ ను ఎసిబి విచారిస్తోంది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత విజయవాడ ఎసిబి కార్యాలయానికి తరలించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఎసిబి విచారణ కొనసాగే అవకాశాలున్నాయి.