ఉంగుటూరు : ఉంగుటూరు మండల కేంద్రంలో మంగళవారం ఉదయం యూరియా కోసం వందలాదిమంది రైతులు బారులుతీరారు. వందలాది మంది రైతులు ఉన్నప్పటికీ స్టాక్ మాత్రం 400 బస్తాలు మాత్రమే ఉన్నది. ప్రతి రైతుకు రెండు బస్తాల యూరియాను ఇస్తున్నారు. మిగిలినవారికి 5వ తేదీన 10 లారీలు వస్తాయని మండలంలోని ప్రతి రైతుకు ఇస్తామని మండల వ్వవసాయ శాఖాధికారి జి రమేష్ చెబుతున్నారు.