నేటి నుంచి వెండి ఆభరణాలపైనా హాల్‌మార్క్

నేటి నుంచి వెండి ఆభరణాలపైనా హాల్‌మార్క్

ముంబై: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నేటి నుంచి దేశంలో వెండి ఆభరణాలు, వస్తువులపై హాల్‌ మార్క్‌ తప్పనిసరి చేసింది.  దీని ప్రకారం, వెండి ఆభరణాలపై  లోగో, శుద్ధత స్థాయి (800, 835, 900, 925, 970, 990), అస్సేయింగ్ సెంటర్ గుర్తు, జ్యువెలర్ గుర్తు, ఇంకా 6 అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఉండాలి. ఈ నియమం బంగారు ఆభరణాలకు ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పుడు వెండి మార్కెట్‌లో పార దర్శకత, నాణ్యతను నిర్ధారించడానికి కొత్తగా హాల్ మార్క్ విధానాన్ని తీసుకువచ్చారు. మార్కింగ్ వల్ల వినియోగదారులకు వెండి శుద్ధతపై నమ్మకం పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి.  పరీక్షా రుసుము, అనుబంధ ఖర్చుల వల్ల  వెండి, ఆభరణాల రీసేల్  ధరలు స్వల్పంగా పెరుగుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos