అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: అమీర్‌పేట బాలాజీ నెయ్యి దుకాణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండి పోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆపారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు తీవ్రంగా ఎగసిపడటంతో పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపుకు కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆ దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు, నష్టం ఎంత వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos