ఢిల్లీ: నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. రోడ్లపై నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ జామ్, విమానాల ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీకెండ్ నుంచి షురూ అయిన వర్షం సోమవారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ లాంటి ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.