ముంబైలో భారీ వర్షం.

ముంబైలో భారీ వర్షం.

ముంబై :  నగరంలోమంగళవారం కూడా భారీ వర్షం  కొనసాగుతోంది. కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. కొనసాగుతున్న భారీ వర్షం నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos