అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రకు మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నట్లు పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 12 గంటల్లో పాడేరులో 16 సెం.మీ. అత్యధిక వర్షపాతంనమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.మంగళవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కోస్తాంధ్ర రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగి స్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.వాతావరణ శాఖ హెచ్చరికలతో విజయవాడలతో అధికారులు, సిబ్బంది కాల్వల్లో పూడికతీస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు కోసం ఇబ్బంది లేకుండా 40కి పైగా పునరావాస కేంద్రాలు సిద్ధంవిశాఖ సింధియాలో ఐవోసీ ఆయిల్ టెర్మినల్ పూర్తిగా నీటమునిగింది. కొల్లేరుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 4.38 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి, గోదావరి నదీపాయల ఉద్ధృతిగా పరుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో 5 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద అధికమవుతోంది. భారీ వర్షాల దృష్ట్యా ఈ ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని మంత్రి అనగాని హెచ్చరించారు.