ఇస్లామాబాద్:పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ తన అమెరికా పర్యటనలో భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపులకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించారు. ఈ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌గా గుర్తింపు పొందింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక విందు సమావేశంలో, మునీర్ ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిత్రంతో పాటు ఖురాన్ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావించారు. అంతేకాదు, భారత్ కు అణు హెచ్చరికలు కూడా చేశారు. అమెరికా నేలపై నుంచి మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ యొక్క యుద్ధోన్మాద వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయని భారత్ అభిప్రాయపడింది. కాగా, మునీర్ న్యూక్లియర్ వార్నింగ్ నేపథ్యంలో… భారత్, పాకిస్థాన్ దేశాల సైనిక, అణు సామర్థ్యంపై చర్చ మొదలైంది.
.