-నక్కపల్లి : లక్కపల్లి తహసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కొరకు పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కే లోకనాథంను పోలీసుల అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. లోకనాథంను తీసుకెళ్తున్న వాహనానికి ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నివారించి, లోకనాథంను తీసుకువెళ్లారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును విరమించుకోవాలని, ప్రతాప్రాయ సేకరణ రద్దు చేయాలని పెద్ద పెట్టున నిర్వాసితులు నినాదాలు చేపట్టి, ఆందోళనకు దిగారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం రాజేష్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.