న్యూఢిల్లీ: ప్రభుత్వ బంగ్లా వివాదంలో బీహార్ ప్రతిపక్షనేత, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడంపై తేజస్వీ సుప్రీం కోర్టులో
దాఖలు చే’సిన పిటిషన్ ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగో య్ కొ ట్టివేశారు. పిటిషన్ దాఖలు చేసినందుకు తేజస్వీనిచీవాట్లు పెట్టారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన బంగ్లాను.. ఆ పదవి లేనప్పుడు ఖాళీ చేయాల్సిందే కదా అని వ్యాఖ్యానించారు. ప్రాధాన్యతలేని పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.50వేలు జరిమానా విధించారు. జేడీయూ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుశీల్ కుమార్ మోదీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న తేజస్వీ .. తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై మండిపడ్డ తేజస్వీ.. రోడ్డుపై ధర్నాకు దిగి నిరసన తెలిపారు. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టేయడంతో .. సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడా తేజస్వీకి ఎదురుదెబ్బ తగిలింది.