ప్రేమ వేధింపులకు యువతి బలి…

  • In Crime
  • February 8, 2019
  • 202 Views
ప్రేమ వేధింపులకు యువతి బలి…

ప్రేమ వేధింపులు
మరోక యువతిని బలి తీసుకున్న ఘటన శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపురం మండంలో చోటు చేసుకుంది. కథలాపూర్‌ మండలం దుంపేట గ్రామానికి చెందిన తోట హర్షిత(22) కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుండేవారు.ప్రతీరోజూ కాలేజీకి వెళ్లి వస్తున్న
హర్షితను అదే గ్రామానికి చెందిన దినేశ్‌ అనే యువకుడు ప్రేమిస్తున్నాని నువ్వు కూడా
ప్రేమించాలంటూ యువతిని పలు రకాలుగా వేధించేవాడు.వేధింపుల గురించి హర్షిత తల్లితండ్రలుకు
తెలపడంతో కొద్ది రోజుల క్రితం పద్ధతి మార్చుకోవాలంటూ హర్షిత తల్లితండ్రులు దినేశ్‌ను
హెచ్చరించారు.అయినప్పటికీ తీరు మార్చుకోని దినేశ్‌ వేధింపులు తీవ్రతరం చేసాడు.దీంతోపాటు
హర్షితను తనకిచ్చి పెళ్లి చేయాలంటూ తన తల్లితండ్రులతో హర్షిత తల్లితండ్రులను అడిగించాడు.దీంతో
మనస్తాపానికి గురైన హర్షిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు
పాల్పడ్డారు.హర్షిత తల్లి భూలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos