సామర్లకోటలో ముగ్గురి హత్య

సామర్లకోటలో ముగ్గురి హత్య

కాకినాడ : సామర్లకోట సీతారామకాలనీలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. ములపర్తి మాధురి (34), ఆమె కుమార్తెలు నిస్సీ (పుష్పకుమారి) (8), జెస్సీ (6) దారుణహత్యకు గురయ్యారు. ఇంట్లోని ఓ రూమ్​లో ముగ్గురి మృతదేహాలూ రక్తపు మడుగులో పడి ఉన్నాయి. బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.మాధురి భర్త ములపర్తి ధనుప్రసాద్ ప్రైవేటు రోడ్డు నిర్మాణ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన ఆయన, ఆదివారం ఉదయం ఇంటికి వచ్చారు. గేటు లోపల తాళం వేసి ఉండటంతో పాటు ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ప్రహరీ దూకి లోపలికి వెళ్లారు. అనంతరం తలుపులు కొట్టినా తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాబిడ్డలు విగతజీవులుగా రక్తపుమడుగులో పడి ఉండడాన్ని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.శోకసంద్రంగా మారిన సీతారామ కాలనీ: ఒకే ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారనే తెలియడంతో సీతారామ కాలనీ శోక సంద్రంగా మారింది. నిత్యం ఇరుగు పొరుగు వారితో సరదాగా మాట్లాడుకుంటూ మంచి చెడులు పంచుకునే మాధురి, ఆమె కుమార్తెలు హత్యకు గురవ్వడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను చూసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో స్థానికులు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos