న్యూఢిల్లీ : నేడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదాపడింది. శుక్రవారం బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌కు వ్యతరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలనుద్దేశించి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ.. సభలో నినాదాలు చేయడం ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదు. ప్రజలు తమ సమస్యలను సభలో ప్రస్తావించడానికి మీకు అవకాశం ఇచ్చారు. మీరు సభలో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. మీరు పార్లమెంటరీ నియమాలను పాటించాలి. మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే సమస్యలను లేవనెత్తాలి’ అని అన్నారు. అయినప్పటికీ సభలో ఎస్‌ఐఆర్‌ను ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగడంతో.. సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేశారు.