బెంగళూరు : బెంగళూరులో ఈ నెల 20 నుంచి 24వతేదీ వరకు జరగనున్న విమాన ప్రదర్శన సందర్భంగా కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేను మూసివేయ నున్నందున
వంద విమానాల రాకపోకలను రద్దు చేయనున్నారు. ఎయిర్ ఏషియాతోపాటు పలు విమానాల రాకపోకలను రద్దు చేయనున్నారు. విమాన ప్రదర్శన సందర్భంగా ఉదయం 10 నుంచి
సాయంత్త్రం 5.00 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేశామని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఈ నేఫథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు గ్లోబల్ కన్సల్టెన్సీలు అప్రమత్తం చేశాయి.