ఆగస్ట్​, సెప్టెంబర్​లో ఎక్కువ వానలు

ఆగస్ట్​, సెప్టెంబర్​లో ఎక్కువ వానలు

న్యూ ఢిల్లీ: నైరుతి రుతుపవనాల రెండో భాగంలో ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భాగాల్లో మినహా  ఇతర ప్రాంతాలలో ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదయ్యే వీలుందని వెల్లడించింది. సెప్టెంబర్‌లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రుతుపవనాల మొదటి భాగంలో (జూన్​, జూలై) దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల రెండో భాగంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం (దీర్ఘకాలిక సగటు 422.8 మిమీలో 106 శాతం) ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.జూన్ 1 నుంచి జూలై 31 వరకు దేశంలో సాధారణం 445.8 మి.మీ. కాగా ఈసారి 474.3 మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపారు. “ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం ఇది వరుసగా ఐదో సంవత్సరం. గత 30 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుతున్న ధోరణి గమనిస్తున్నాం” అని ఆయన తెలిపారు.జూన్-సెప్టెంబర్ రుతుపవన కాలంలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 శాతం- 106 శాతం వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos