ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ పై ఆగ‌స్టు 12, 13 లో సుప్రీం విచార‌ణ‌

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ పై  ఆగ‌స్టు 12, 13 లో సుప్రీం విచార‌ణ‌

న్యూఢిల్లీ: బీహార్‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌ను వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్ల‌పై ఆగ‌స్టు 12,13 తేదీల్లో సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ ఇటీవ‌ల ఓట‌ర్ల జాబితాను స‌వ‌రించారు. ఆ రాష్ట్రంలో ఉన్న సుమారు 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను జాబితా నుంచి తొల‌గించారు. ఆ ఓట‌ర్లు బ‌హుశా మ‌ర‌ణించి ఉంటార‌ని, లేదా మ‌రో ప్రాంతానికి ప‌ర్మ‌నెంట్‌గా మారి ఉంటార‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. అయితే ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పేరుతో ఈసీ అస‌లైన ఓట‌ర్ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు సుప్రీంలో పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆ పిటీష‌న్ల‌పై ఆగ‌స్టు 12, 13 తేదీల్లో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos