మాజీ మంత్రి అనిల్‌కు పోలీసుల‌ నోటీసులు

మాజీ మంత్రి అనిల్‌కు పోలీసుల‌ నోటీసులు

కోవూరు : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిని దూషించిన కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న ఉద‌యం 10 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో నివాసానికి కోవూరు ఎస్ఐ రంగ‌నాథ్ గౌడ్ నోటీసులు అంటించారు. కాగా, ఈ కేసులో ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos