వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే…

  • In Crime
  • February 8, 2019
  • 943 Views
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే…

వివాహేతర సంబంధానికి
అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ  ప్రియుడితో కలసి భర్తను
హత్య చేసిన ఘటన శుక్రవారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. సిఖ్‌విలేజ్‌ చందూలాల్‌ బౌలికి చెందిన ఇంతి యాజ్‌ ఖాన్‌ (34) అలియాస్‌ బాబాఖాన్‌ స్థానికంగా టైలర్‌ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పన్నెండేళ్ల క్రితమే భార్య ముగ్గురు పిల్లలను వదిలేసిన బాబాఖాన్, ఉప్పల్‌ బీరప్పగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న జహేదా బేగంను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. బాబాఖాన్‌తో వివాహం నాటికే జహేదాకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే జహేదాకు కొంతకాలం క్రితం ఓల్డ్‌ బోయిన్‌పల్లి హెచ్‌ఏల కాలనీకి చెందిన ఉబర్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సయ్యద్‌ ఫయాజ్‌ ఆలంతో కొంతకాలం క్రితం  వివాహేతర సంబం ధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన బాబాఖాన్‌ భార్యను మందలించడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు.  భార్య కు మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురిపట్ల కూడా బాబాఖాన్‌ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ పరిణామాలతో  భర్త అడ్డుతొలగించుకోవాలని భావించిన జహేదా, ప్రియుడు ఫయాజ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. గతేడాది నవంబర్‌ 15న రాత్రి 11.00 గంటల సమయంలో బాబాఖాన్‌కు బ్లాక్‌టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. బాబాఖాన్‌ గాఢ నిద్రలోకి వెళ్లాడని నిర్ధారించుకున్న జహేదా, ఫయాజ్‌తో పాటు అతని మిత్రులు మహ్మద్‌ బాబర్, మహ్మద్‌ అక్రమ్, సయ్యద్‌ సజ్జాద్‌లతో కలిసి బాబాఖాన్‌ను గొంతునులిమి చంపేశారు. మధ్యలో మెలకువ వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన బాబాఖాన్‌ గొంతుపై గట్టిగా అదిపట్టడంతో గాయాలయ్యాయి. మరునాటి ఉదయం నిద్రలేపేందుకు యత్నించగా, ఎంతకూ లేవడం లేదని జహేదా పొరుగున ఉండే ఓ నర్సుకు సమాచారం ఇచ్చింది. తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వగా అదే రోజు సాయంత్రం బషీర్‌బాగ్‌లోని స్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ సందర్భంగా బాబాఖాన్‌ గొంతుపై గాయాలను గుర్తించిన అతని సోదరుడు వదినన నిలదీయగా ఆమె చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఈ సందర్భంగా ఆ గాయాల ఫొటోలతో బాబాఖాన్‌ సోదరుడు ఫజ్జుఖాన్‌ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ఈ క్రమంలో అదేనెల 21వ తేదీన బాబాఖాన్‌ మృతదేహానికి
పంచనామా నిర్వహించగా హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జహేదాను అదుపులోకి తీసుకొని తమదైన
శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.దీంతో జహేదాతో పాటు ప్రియుడు ఫయాజ్‌ హత్యకు
సహకరించిన మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos