రష్యాతో వ్యాపారం.. భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు

రష్యాతో వ్యాపారం.. భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు

వాషింగ్టన్‌ : ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు. ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్సే గ్రాహం మాట్లాడుతూ.. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్ , చైనా దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్‌ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్‌ తెచ్చే ఈ బిల్లు భారత్‌, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos