రూపాయికే 1 జీబీ డేటా

రూపాయికే 1 జీబీ డేటా

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 4G డేటాను భారీ తగ్గింపులతో అందించే కొత్త ఫ్లాష్ సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ గురించి సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా వివరాలను పంచుకుంది. 90,000 4G టవర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్, 2025 మధ్యలో ఒక లక్ష 4G టవర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ Xలో చేసిన పోస్ట్ ప్రకారం, ఈ ఫ్లాష్ సేల్ జూన్ 28న ప్రారంభమైంది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఈ పరిమిత కాలంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కేవలం రూ. 400కి 400GB డేటాను కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రతి GBకి రూ. 1 ధర పడుతుందని చెప్పవచ్చు. ఈ ఆఫర్‌ను ఆసక్తి ఉన్న కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సేవా యాప్ ద్వారా పొందవచ్చు. ఈ ఫ్లాష్ సేల్ ద్వారా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కూడా ప్రయత్నిస్తోంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos