ఉదయ్ పూర్ : ఫ్రాన్స్ దేశానికి చెందిన పర్యాటకురాలికి సిటీ చూపిస్తానంటూ ఓ ఉద్యోగి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉదయ్ పూర్ సిటీలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయ్ పూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన యువతి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్మిస్తున్న యాడ్ షూట్ కోసం భారత్‌కు వచ్చింది. ఏడాది వీసాపై గత నవంబర్ నుంచి ఆమె ఇక్కడ ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉద్యోగి సిద్ధార్థ్ ఉదయ్ పూర్ సిటీ చూపిస్తానని చెప్పి యువతిని తన హోటల్ గదికి తీసుకెళ్లాడు. ఆమెపై అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.