చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

అనంతపురం:  తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం  తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు రైల్లో  దోపిడీకి పాల్పడ్డారు. ముంబయి నుంచి చెన్నైకి వెళ్లే చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దుండగులు కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ కేబుల్‌ కత్తిరించి రైలును ఆపారు. ఆ తర్వాత బోగీలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos