న్యూ ఢిల్లీ: సరిహద్దు, కొండ ప్రాంతాల్లో జంతువుల వల్ల ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారని అంటున్నారు. కానీ, మానవుల వల్లే అవి వేరే ప్రదేశాలకు వెళ్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో జంతవులకు హెలికాప్టర్ సేవలు పెద్ద సమస్యగా మారాయని అక్కడి పర్యావరణ వేత్తలు అంటున్నారు. చార్ధామ్ యాత్ర సమయంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. హెలికాప్టర్ల శబ్దం 40 డెసిబెల్స్ను మించితే అది జంతువులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించవచ్చని పర్యావరణ వేత్త రంజన్ కుమార్ అన్నారు. ‘హెలికాప్టర్లు ఈ స్థాయిని దాటి, తీవ్రమైన శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తాయి. దానిని భరించలేక జంతువులు అడవుల నుంచి వేరే ప్రదేశాలకు వలస వెళ్తున్నాయి. శబ్ద కాలుష్యం తగ్గిన తర్వాత తిరిగి వస్తున్నాయి’ అని రంజన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. మానవుల అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్ట్ వల్ల కూడా ఈ సమస్య తలెత్తుందని మరో పర్యావరణవేత్త ఎస్పీ సతి అన్నారు. ‘ ఉత్తరాఖండ్‌లోని రాజాజీ నుంచి కార్బెట్ టైగర్ రిజర్వ్ వరకు అనేక మార్గాల్లో అభివృద్ధి పనులు జరిగిపోతున్నాయి. దీని కారణంగా జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం హెలికాప్టర్లు అడవిప్రాణులకు అతిపెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా కేదార్‌నాథ్‌కు వెళ్లే హెలికాప్టర్ల వల్ల మొత్తం లోయ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమవుతోందిఅధిక శబ్దం జంతువులను వలస వెళ్లేలా చేయడమే కాకుండా వాటిని ఆగ్రహానికి గురి చేసేలా చేస్తోందని వెటర్నరీ డాక్టర్ ప్రదీప్ మిశ్రా అంటున్నారు. ‘కొన్ని జంతువులు నిశ్శబ్ద ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడతాయి. మానవుల లాగానే జంతు వులు కూడా ఆధిక శబ్దాలకు ఇబ్బంది పడతాయి. అది వాటి ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుంది’ అని ప్రదీప్ పేర్కొన్నారు.