జూలై నుంచి ఢిల్లీలో ఆ వాహ‌నాల‌కు పెట్రోల్‌, డీజిల్ పోయ‌రు

జూలై  నుంచి ఢిల్లీలో ఆ వాహ‌నాల‌కు పెట్రోల్‌, డీజిల్ పోయ‌రు

న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహ‌నాల‌కు జూలై ఒక‌టో తేదీ నుంచి పెట్రోల్‌, డీజిల్ పోయ‌రాద‌న్న కొత్త నిబంధ‌న‌ల‌ను ఢిల్లీలో అమ‌లు చేయ‌నున్నారు. రిజిస్ట్రేష‌న్‌ చేసి ప‌దేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్ల దాటిన పెట్రోల్ వాహ‌నాల‌కు.. ఢిల్లీలో ఇంధ‌నం పోయ‌రని క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్‌(సీఏక్యూఎం) పేర్కొన్న‌ది. ఢిల్లీలో సుమారు 520 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాంట్లో 500 బంకుల్లో ఆటోమేటెడ్ నెంబ‌ర్ ప్లేట్ రిక‌గ్నిష‌న్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. మిగతా వాటిల్లో జూన్ 30వ తేదీగా ఆ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అవి ప‌దేళ్లు దాటిన డీజిల్‌, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహ‌నాల‌ను  గుర్తుపడతాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos