ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తే.. ఏడేళ్ల జైలుశిక్ష‌, 10 ల‌క్ష‌ల జరిమాన

ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తే.. ఏడేళ్ల జైలుశిక్ష‌, 10 ల‌క్ష‌ల జరిమాన

బెంగుళూరు: సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న‌వారిపై రాష్ట్ర ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్నారు. స‌మాచార దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు.. ఒక‌వేళ ఎవరైనా ఫేక్ న్యూస్‌ను ప్ర‌చారం చేస్తే, వాళ్ల‌కు ఏడేళ్ల జైలుశిక్ష‌, ప‌ది ల‌క్షల జ‌రిమానా విధించ‌నున్నారు. దీనిపై క‌ర్నాట‌క స‌ర్కారు ముసాయిదాను త‌యారు చేసింది. క‌ర్నాట‌క మిస్ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్ ముసాయిదాను రెండేళ్ల క్రితం రూపొందించారు. అయితే గ‌త వారం దాన్ని క్యాబినెట్ ముందు ప్ర‌వేశ‌పెట్టారు. సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను నియంత్రణకు  ప్ర‌త్యేక కోర్టులనూ ఏర్పాటు చేస్తున్న‌ది. త్వ‌ర‌గా కేసుల‌ను ప‌రి ష్కారానికి ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌తి స్పెష‌ల్ కోర్టుకు ఓ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌ను నియ‌మిస్తారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos